ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదనీ మైనర్ బాలికపై అత్యాచారం...
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ముర్దానగర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ముర్దానగర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
యూపీలోని ముర్దానగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక.. ఓ పండుగ నిమిత్తం ఓ వ్యక్తి నుంచి రూ.1500 అప్పు తీసుకుంది. అయితే ఆ డబ్బులు ఆమె తిరిగి చెల్లించలేక పోయింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి చేయసాగాడు. అయనప్పటికీ ఆ యువతి ఇవ్వలేక పోయింది.
అయితే గురువారం కొన్ని పత్రాలను జిరాక్స్ తీయించుకుని తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో డబ్బులిచ్చిన వ్యక్తులు జాహీద్, మోహన్ పాల్‌తో పాటు మరో మైనర్ కలిసి ఆ బాలికను ఆపారు. అక్కడ్నుంచి నిర్మానుష్య ప్రదేశంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
ఆ వారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చిన ఆ యువతి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు జాహీద్, మోహన్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.