శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (12:20 IST)

పశువుల మేత కోసం వెళ్తే.. తుపాకీతో.. బాలికపై అత్యాచారం..

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అదీ యూపీలో నెరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి.


తాజాగా ఓ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మన్‌సూర్‌పూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. 
 
పశువులకు మేత సేకరించేందుకు పచ్చిక మైదానానికి వెళ్లిన బాలికను బలవంతంగా తుపాకీతో బెదిరించారు దుండగులు. ఆపై దగ్గరలోని చెరకు తోటలోకి లాక్కెళ్లి  తుపాకీతో చంపేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పోలీసులకు సమాచారం అందడంతో బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.