శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (12:45 IST)

"నా చక్రవ్యూహ ప్రసంగం... 2 ఇన్ 1‌"కు నచ్చలేదు... అందుకే ఈడీతో దాడికి కుట్ర : రాహుల్

Rahul Gandhi
ఇటీవల లోక్‌సభలో తాను చేసిన చక్రవ్యూహ ప్రసంగం 2 ఇన్ 1కు ఏమాత్రం నచ్చలేదని, అందుకే ఈడీతో దాడి చేయించేందుకు ప్లాన్ చేసినట్టు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. చాయ్, బిస్కెట్లుతో అధికారుల కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తుంటాని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కాగా, జూలై 29వ తేదీన కేంద్ర బడ్జెట్‌ 2024పై రాహుల్ గాంధీ సుధీర్ఘ ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పార్టీ కమలం గుర్తును ప్రదర్శించిన ఆయన 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం సిద్ధమైందంటూ విమర్శలు గుప్పించారు. తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం అనంతరం తనపై దాడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. 
 
మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టానని, 'పద్మవ్యూహం' అని కూడా పిలవొచ్చని అన్నారు. 'పద్మవ్యూహం అంటే 'కమలం ఏర్పడటం'. 21వ శతాబ్దంలో ఒక కొత్త 'చక్రవ్యూహం' ఏర్పడింది. అభిమన్యుడి మాదిరిగా భారతదేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న - మధ్యతరహా వ్యాపారులు నేడు ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ' అని అన్నారు.