శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (16:12 IST)

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

Priyanka Gandhi
Priyanka Gandhi
కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరిపై 4.08 లక్షల ఓట్ల బంప‌ర్‌ మెజారిటీతో గెలిచారు. 
 
అయితే, ఇక్కడ అత్యధిక ఓట్ల మెజారిటీ రికార్డు ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ పేరిట ఉంది. రాహుల్‌గాంధీ 2019లో సాధించిన 4.30 లక్షల ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ. 
 
అయితే, రాహుల్ గాంధీ ఇటీవలి (2024) ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. ఇప్పుడు 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంక అన్నయ్యను అధిగమించారు.