శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (10:31 IST)

ఆ దాడిని అవమానకరంగా భావించా.. అందే సర్జికల్ స్ట్రైక్స్ : మనోహర్ పారీకర్

మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి

మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తెలిపారు. గోవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 
 
ముఖ్యంగా.. 2015 జూన్‌ 4న జరిగిన ఆ ఘటనతో తీవ్ర అవమానానికి గురయ్యానని, దాంతో పశ్చిమ సరిహద్దులలో సర్జికల్‌ దాడులు చేయాలని జూన్‌ 9న నిర్ణయం తీసుకుని, సుదీర్ఘ సన్నాహాల అనంతరం 2016 సెప్టెంబర్‌ 29న ఆ దాడులు చేశామని వెల్లడించారు. 
 
15 నెలల పాటు ప్రణాళికలు రచించి, అదనపు బలగాలకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సేకరించి మరీ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డీఆర్డీవో రూపొందించిన ‘స్వాతి వెపన్‌ లొకేటింగ్‌ రాడార్‌’ను తొలిసారిగా ఈ దాడుల్లోనే ఉపయోగించామని, దాని సాయంతోనే పాకిస్థానీ ఫైరింగ్‌ యూనిట్లను గుర్తించామన్నారు. 
 
కేవలం ఆ రాడార్‌ వల్లే పాక్‌ ఆర్మీకి చెందిన 40 ఫైరింగ్‌ యూనిట్లను ధ్వంసం చేయగలిగామన్నారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో తాము చేసిన సర్జికల్‌ దాడులలో 70-80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు.