లాక్‌డౌన్ సమయంలో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసిన వస్తువు ఏంటి?

online payments
వి| Last Modified శనివారం, 1 ఆగస్టు 2020 (15:04 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్ కొనసాగించిన విషయం తెలిసినదే. లాక్ డౌన్ రోజుల్లో చాలావరకు దుకాణాలు మూసి వేయడం, ప్రజలు బయట తిరగడానికి అనుమతించక పోవడం వంటి కారణాల వలన ప్రజలు ఆన్లైన్ షాపింగ్ పైన అధికంగా మొగ్గు చూపారు.

తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో భారతీయులు లాక్ డౌన్ సందర్భంలో ఏమేమి కొన్నారన్న విషయం వెల్లడైంది. అత్యధికంగా 55 శాతం మంది కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాలలో కొనుగోలు చేసే కిరాణా వస్తువులను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసారట.

ఆ తర్వాత 53 శాతం దుస్తులు, 50 శాతం ఎలక్ట్రానిక్ వస్తువులు, 44 శాతం ఔషధాలు, 60 శాతం వాహనాలు, 40 శాతం మంది ప్రయాణపు టికెట్లను బుకింగ్ చేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
దీనిపై మరింత చదవండి :