శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:22 IST)

జయలలిత ఆస్తుల్ని పర్యవేక్షించేది ఎవరో? జూన్‌లో తేలిపోతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఇకపై పర్యవేక్షించేంది ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. జూన్ ఆరో తేదీ నుంచి చెన్నై హైకోర్టులో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షకుడిని నియమించాలని అన్నాడీఎంకే నేతలు పుగళేంది, జానకీరామన్‌లు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌లో జయలలిత ఆస్తులతో దీప, దీపక్‌లకు జయమ్మ ఆస్తులతో సంబంధం లేదన్నారు. అయితే జయమ్మ మేనకోడలు దీప తరపు లాయర్లు జయలలిత ఆస్తులు తమకే సొంతం అని వాదించారు. కానీ మరో కేసులో జయలలిత ఆస్తులు రూ.10.12 కోట్లు అని.. ఆదాయ పన్ను రూ.6.62 కోట్లు వున్నాయని తెలిసింది. దీంతో ఈ కేసులో తుది దశ విచారణ జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది.