గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By

నా పాస్‌పోర్టును నా మనవడికి అందకుండా పెట్టాలి...

దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మనసును కదిలించే అంశాలపై ఆయన తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ చిరిగిపోయిన పాస్‌పోర్టుపై స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'పిల్లాడు డ్యామేజ్ చేసిన పాస్‌పోర్టు ఫోటోను షేర్ చేసి.. నా మనవడికి నా పాస్‌పోర్టును అందకుండా పెట్టాలి. లేకపోతే నా పాస్‌పోర్టుకు కూడా ఇదే గతి పడుతుందేమో.. నా మనవడు ఆ పిల్లాడిలా క్ష‌మాప‌ణ‌లు చెప్పడు'.. అంటూ ట్వీట్ చేశారు. 
 
అంతే.. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఆనంద్ చేసిన ట్వీట్‌పై వాళ్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 
 
సార్.. మీరేమీ టెన్షన్ పడకండి. పాస్‌పోర్ట్‌ను మందంగా ఉండే ప్లాస్టిక్ షీట్‌తో తయారు చేస్తారు. ఈ ఫోటో కూడా ఫేక్.. అని ఒకరు... సార్ అది ఫేక్ స్టోరీ.. మీ పాస్‌పోర్ట్ సేఫే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.