శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:46 IST)

పది రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మేడపైకెక్కి అలా అరవడంతో?

మహిళలను రక్షించేందుకు ఎన్ని ఉద్యమాలొచ్చినా.. అరాచకాలు మాత్రం జరుగుతూనే వున్నాయి. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతిపై పదిరోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు.

మహిళలను రక్షించేందుకు ఎన్ని ఉద్యమాలొచ్చినా.. అరాచకాలు మాత్రం జరుగుతూనే వున్నాయి. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతిపై పదిరోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువతిని ఒడిశాలోని పూరీలో పది రోజుల పాటు ఓ మార్కెట్ కాంప్లెక్స్‌లో బంధించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి.. ఇద్దరు నిందితులన పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాజల్ అనే మహిళ బాధితురాలిని ఏడాది క్రితం ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకువచ్చింది. అంతేగాకుండా తనను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపిందని బాధితురాలు చెప్పినట్లు పూరీ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండ్ గార్గేయన్ మహంతి చెప్పారు. తనతో పాటు మరికొందరు కూడ బందీలుగా ఉండి రోజుల తరబడి అత్యాచారానికి గురైనట్టు బాధితురాలు వెల్లడించినట్లు మహింతి వెల్లడించారు. 
 
తాను బందీగా ఉన్న భవనం పైకి ఎక్కి రక్షించాలని బాధితురాలు అరవడంతో తాము భవనం తాళం పగులకొట్టి ఆమెను కాపాడినట్లు గార్గేయన్ చెప్పారు. బుధవారం సాయంత్రం బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో తరలించినట్లు తెలిపారు.