గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:34 IST)

మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. రైల్వే ఏం చేస్తోంది.. కోర్టు సీరియస్

woman
రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై రైల్వేశాఖపై అలహాబాద్ కోర్ట్ సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో విఫలమైనందుకు రైల్వేను హైకోర్టు తప్పుబట్టింది. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఆమె రక్తపు మడుగులో పడి వుండటంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆగస్ట్ 30న అయోధ్య స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్న మహిళా కానిస్టేబుల్, ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయగా, ఆమె పుర్రెకు రెండు పగుళ్లు వచ్చాయి. ఆమెను లక్నోలోని కెజిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని జిఆర్‌పి తెలిపింది.