ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (09:03 IST)

ఔను.. నేను చెపితేనే అలా చేసుకున్నారు.. తాంత్రిక మహిళ

దేశ రాజధానిని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ, బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులోని మిస్టరీ క్రమంగా వీడుతోంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ నేర పోలీసు విభాగం.... 'గీతా మా' అనే తాంత్రికురాల

దేశ రాజధానిని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ, బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులోని మిస్టరీ క్రమంగా వీడుతోంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ నేర పోలీసు విభాగం.... 'గీతా మా' అనే తాంత్రికురాలిని అదుపులోకి తీసుకున్నారు.
 
భాటియా కుటుంబాన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని గీతా మా కెమెరా సాక్షిగా అంగీకరించినట్టు తెలుస్తోంది. 11 మందిని ఆత్మహత్యలకు పురిగొల్పింది తానేనని చెబుతున్న గీతా మా వీడియోను శుక్రవారం ఓ జాతీయ చానెల్ ప్రసారం చేసింది. 'వారిని ఆత్మహత్యల వైపు నడిపించింది నేనే. వారు తమ జీవితాలను ఎలా అంతం చేసుకోవాలో వివరంగా చెప్పా' అని ఆ వీడియోలో ఉంది. 
 
అయితే, ఆమె అంగీకారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. బురారీ ఆత్మహత్యలు ఆదివారం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి. పదిమంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఇంటి పెద్దావిడ నారాయణ్ దేవి మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. శవపరీక్ష నివేదికలో మాత్రం వారు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్టు తేలింది.