శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (09:50 IST)

అక్రమ సంబంధం పెట్టుకుందనీ మహిళ జట్టు కత్తిరించి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు...

victim
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కొందరు స్థానికులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ తర్వా ఆమె జట్టు కత్తిరించి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరందీఘీ బ్లాకులో నివాసం ఉంటున్న మహిళపై గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఆమెను రక్షించి వైద్యం కోసం రాయింజ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. రక్షించడానికి వచ్చిన భర్తను కట్టేసి, విచక్షణారహితంగా తనపై దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
 
'నేను ఇంట్లో లేని సమయంలో స్థానికులు దాడి చేశారు. నా కుమారుడు, కోడలిని కొట్టారు. ఆమె ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి కదా! దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలి మామ పోలీసులను కోరారు. 
 
కాగా, రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల కక్షల కోణం కూడా ఈ దాడి వెనుక ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ మీనా తెలిపారు.