శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (12:21 IST)

అతనికి మహిళల లోదుస్తులు అంటే మహా ఇష్టం

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో రాత్రిపూట మహిళల లోదుస్తులను చోరీ చేసే సైకోను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లా ఒక్కిలిపాళయం ప్రాంతంలో గత నెల రోజులుగా ఇళ్లలో  ఆరవేసిన ఆడవారి లోదుస్తులు మాయమవుతున్నాయి.

కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని  మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు.

చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారైక్కాల్‌ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్‌ గా గుర్తించారు. అతను పగటిపూట తాపీ పనికి వెళుతూ రాత్రిపూట ఆడవారి లోదుస్తులను చోరీ చేసుకెళ్లేవాడని తేలింది.