ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (17:52 IST)

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు: అనిత

జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వంగలపూడి అనిత. కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై సునీల్ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలు.
 
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయి. మహిళలకు రక్షణ కరువైంది. మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు.
 
దిశ దశ లేని చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మద దాడులు కనిపించడం లేదా? మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే రోజురోజుకు మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నా అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటూ ప్రశ్నించారు అనిత.