బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:37 IST)

గదిలో ప్రియురాలితో రహస్యంగా ప్రియుడు.. కుటుంబ సభ్యులు వెంటపడగానే బావిలోపడ్డారు..

boy in well
బీహార్ రాష్ట్రంలోని చాప్రాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమెతో కలిసి రహస్యంగా ఓ గదిలో ఉన్నాడు. ఇంతలో ఆ గదిలోకి కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగా శబ్ధం వచ్చింది. దీంతో వారి కంటపడకుండా ఉండేందుకు అక్కడ నుంచి పరుగు పెట్టారు. ఈ క్రమంలో అనుకోకుండా ఆ ఇంటి ప్రాంగణంలో ఉన్న బావిలో ప్రియుడు పడ్డాడు. 
 
దీనిని గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో బయటకు తీశారు. ఆ తర్వాత తమ యువతితో పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడిన యువకుడిని పట్టుకుని చితకబాదారు. అయితే, గ్రామస్తుల జోక్యం చేసుకుని వారిద్దరిని ఏకం చేసారు. దీంతో బావిలో పడ్డా.. ప్రియురాలిని దక్కించుకున్నాడు అంటూ స్థానికులు కామెంట్స్ చేయసాగారు. 
 
ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. చాప్రాలోని మోతిరాజ్‌పురాకు చెందిన మున్నారాజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అపుడపుడూ వారిద్దరూ రాత్రివేళ ఏకాంతంగా కలుసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి యువతి తన గదిలో ఒంటరిగా నిద్రిస్తుండగా, ఇంటి వెనుక ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. యువతితో రహస్యంగా గదిలో ఉన్న సమయంలో యువతి కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగా శబ్దం రావడంతో వారి కంట కనపడకుండా ఉండేందుకు వీలుగా ప్రియురాలితో పారిపోయేందుకు ప్రయత్నించి వారికి చిక్కి, చివరకు ప్రియురాలిని దక్కించుకున్నారు.