శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (13:21 IST)

నన్ను కాదనీ వాడితో నిశ్చితార్థం చేసుకుంటావా? యువతిని కాల్చి చంపిన ప్రియుడు!

తాను గాంఢంగా ప్రేమించిన యువతి మరో యువకుడుతో నిశ్చితార్థం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రియుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈఘటన ముంబై నగరంలోని మలాడ్ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని మలాడ్ ప్రాంతానికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తాను ప్రేమించిన యువతికి నిశ్చితార్థం జరగడంతో ఆగ్రహించిన యువకుడు తుపాకీతో యువతిని కాల్చి చంపి, దాంతో తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ సంఘటన స్థలానికి మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్, డీసీపీ దిలీప్ సావంత్‌లు వచ్చి పరిశీలించారు. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ ఘటన జరిగిందని డీసీపీ చెప్పారు. సంఘటన స్థలంలో తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.