మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:18 IST)

సుశాంత్ కేసు.. ఎన్సీబీ ముందు ప్రత్యక్షమైన రియా చక్రవర్తి, షోవిక్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తరుణంలో రియాతో పాటు ఆయన సోదరుడు షోవిక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం ముందు ప్రత్యక్షం అయ్యారు.

రియా యొక్క బెయిల్ నిబంధనల ప్రకారం, ప్రతి నెల మొదటి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావలసి ఉంది. ఇలా ఆరు నెలల పాటు రియా హాజరు కావలసి ఉండగా, సోమవారం తన సోదరుడు, తండ్రి ఇంద్రజిత్‌తో కలిసి ఎన్సీబీ ఆఫీసుకు వెళ్ళింది. 
 
జైలు నుండి విడుదలైన తర్వాత పబ్లిక్‌లో పెద్దగా కనిపించేందుకు వీరు ఆసక్తి చూపించడం లేదు. కాగా, రియా బాంద్రాలో ఇల్లు కొనేందుకు అన్వేషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా సుశాంత్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ని కూడా ఎన్సీబీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం రియా, షోవిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. రియాకు వెంటనే బెయిల్ దొరకడంతో ఆమె విడుదల కాగా, షోవిక్ చక్రవర్తి బెయిల్ తిరస్కరణకు గురికావడంతో మూడు నెలలుగా జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే.