శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:52 IST)

మహారాష్ట్రలో జికా వైరస్‌

మహారాష్ట్రలో తొలి జికా వైరస్‌ వెలుగుచూసింది. దేశ వ్యాప్తంగా చూస్తే కేరళలో తొలి కేసు నమోదు కాగా, మహారాష్ట్రలో రెండవది.

పూణె జిల్లాలోని పురంధర్‌ తాలూకాకు చెందిన 50 ఏళ్ల మహిళ జికా వైరస్‌ బారిన పడ్డారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపింది.

మొత్తంగా ఐదు అనుమానిత కేసులను పరీక్షలకు పంపగా..ఒక్కటి జికా వైరస్‌గా గుర్తించారు. ఆమె బెల్సార్‌ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చేరి.. చికిత్స పొంది ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులెవ్వరూ ఈ జికా వైరస్‌ బారిన పడలేదు.