శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Kowsalya
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:31 IST)

''విజయదశమి'' నాడు ఎర్రటి వస్త్రాలు ధరించాలి.. ఎందుకు..?

నవరాత్రులలో చివరి రోజునే విజయదశమి అంటారు. ఈ రోజున దుర్గాదేవిని దర్శించుకోవాలి. ఈ నాడున సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేసి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి

నవరాత్రులలో చివరి రోజునే విజయదశమి అంటారు. ఈ రోజున దుర్గాదేవిని దర్శించుకోవాలి. ఈ నాడున సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేసి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో రంగవల్లికలతో అలంకరించుకోవాలి. విజయదశమి రోజున ఎర్రటి వస్త్రాలు వేసుకుని రాజరాజేశవ్వరి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటోను సిద్ధం చేసుకోవాలి.
  
 
అమ్మవారి పూజకు ఎర్రటి అక్షతలు, కనకాంబరాలు, నల్ల కలువ పువ్వులు ఉపయోగించాలని పురాణాలలో చెబుతున్నారు. అలానే వారికి నైవేద్యంగా పొంగలి, పులిహోర, అరటి పండ్లు పెట్టాలి. దీపారాధనకు 3 ప్రమిదెలు, 9 వత్తులు వెలిగించాలి. అమ్మవారి హారతికి ఆవునెయ్యిని లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి. ఈ రోజున స్త్రీలు నుదుటిన కుంకుమ ధరించి శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి నిత్యం దీపారాధన చేయవలసి ఉంటుంది. 
 
ఈ రోజున తామరమాలను ధరించి పూజలు చేసేటప్పుడు ఆగ్నేయం వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు.