బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (12:33 IST)

సూర్యభగవానుని తామర పువ్వులతో పూజిస్తే..?

సూర్యభగవానునికి ప్రత్యక్ష దైవంగా ఆరాధించడం వేదం కాలం నుండి ఉంది. అవతారమూర్తులు, ఇంద్రాది దేవతలు, మహర్షులు వంటివారు కూడా సూర్యభగవానుని ఆరాధించిన వారే. సూర్యోదయంతోనే సమస్త జీవులలో చైతన్యం ప్రారంభమవుతుంద

సూర్యభగవానునికి ప్రత్యక్ష దైవంగా ఆరాధించడం వేదం కాలం నుండి ఉంది. అవతారమూర్తులు, ఇంద్రాది దేవతలు, మహర్షులు వంటివారు కూడా సూర్యభగవానుని ఆరాధించిన వారే. సూర్యోదయంతోనే సమస్త జీవులలో చైతన్యం ప్రారంభమవుతుంది. జీవరాశికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి ద్వారా సూర్యుడే అందజేస్తుంటారు. అందువలనే జీవుల జీవనానికి ఆధారభూతుడు సూర్యుడని చెబుతుంటారు.
 
సూర్య కిరణాల వలన రకరకాల రోగకారక క్రిములు నశించిపోతాయి. దాంతో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. దీని కారణంగానే నివాస ద్వారం తూర్పు ముఖంగా ఉండేలా చూసుకుంటారు. సూర్య నమస్కారంతో శారీరకపరమైన ఆరోగ్యం కలుగుతుంది. 
 
సూర్యభగవానుని పూజకు జాజి, తామర, పొగడ, పున్నాగ, మోదుగ, గన్నేరు, సంపంగి, గులాబీ, మందారాలు విశేషమైనవిగా చెబుతుంటారు. సూర్యభగవానుని పూజలో ఈ పువ్వులను ఉపయోగించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలలో చెబుతున్నారు.