గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (14:08 IST)

గురువుల ఆరాధన ఫలితం....

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణలలో చెబుతున్నారు. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భ

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణాలలో చెప్పబడి వుంది. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భక్తులు వారి ఇష్టదేవతల గురించి ఆరాధన చేయడం వలన ఫలానా గురువును ఆశ్రయించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని సాక్షాత్తు దైవమే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
 
గురువు స్థానం అంతటి విశేషమైనదిగా, విశిష్టంగా కనిపిస్తుంది. అలాంటి గురువులలో ఆదిశంకరాచార్యులు, రాఘవేంద్రస్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కలో కోటస్వామి, షిరిడి సాయిబాబా తదితరులు కనిపిస్తుంటారు. ఎవరైతే గురువును విశ్వసిస్తారో వారికి త్రిమూర్తుల కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. 
 
దారిద్ర్యంతో కష్టాలు పడుతున్న వారికి సంపదలను అనుగ్రహిస్తారు. జీవితాన్ని అజ్ఞానం, అనారోగ్యం తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి సమస్యల నుండి విముక్తిని కలిగించే వారిగా గురువులు కనిపిస్తుంటారు. అంతేకాకుండా ఆశ్రయించినవారి పరిస్థితిని గ్రహించి కోరిన వరాలను ప్రసాధిస్తుంటారు.