ఆదివారం, 29 జనవరి 2023
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:58 IST)

వేడి వేడిగా చికెన్ టిక్కా బార్బెక్యూ ట్రై చేయండి..

Tandoori chicken
వర్షాకాలంలో వేడి వేడిగా చికెన్ టిక్కా బార్బెక్యూ టేస్టు చేయండి.. ఎలా చేయాలో చూద్దాం.. 
 
చికెన్ - ఒక కిలో 
చికెన్ టిక్కా లేదా BBQ మసాలా - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 100 ml లేదా 150 ml
కస్తూరి మేతి - 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - కొద్దిగా
 
శుభ్రం చేసి కట్ చేసిన చికెన్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, పెరుగు, రుచికి ఉప్పు, ఆలివ్ ఆయిల్,  కస్తూరి మేతి పొడి వేసి కనీసం నాలుగు గంటలు పక్కనబెట్టాలి. బార్బెక్యూ మసాలా బాగా చికెన్ ముక్కలకు పట్టిన తర్వాత.. బార్బీక్యూ స్టిక్స్ తో ఫ్రై చేసి దించేయాలి. 
 
రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. అంతే రుచికరమైన చికెన్ టిక్కా బార్బెక్యూ సిద్ధం. వీటిని కూరగాయల సలాడ్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.