గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 మార్చి 2022 (23:27 IST)

సండే స్పెషన్ కొరమీను చేపల ఫ్రై ట్రై చేయండి

కొరమీను చేపలు ముల్లు లేకుండా భలే టేస్టుగా వుంటాయి. ఈ చేపలు మిగిలిన చేపల కంటే భిన్నం. ఈ సండే స్పెషల్ వంటకంగా కొరమీను చేపల కూరను ట్రై చేయండి.
 
కావలసినవి...
కొరమీను చేపలు... నాలుగు
కారం పేస్ట్... నాలుగు టీస్పూన్లు
పసుపు... రెండు టీస్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్... 50 గ్రాములు
నిమ్మకాయ... ఒకటి
కరివేపాకు... కొద్దిగా
నూనె.. సరిపడా
ఉప్పు... తగినంత
 
తయారీ విధానం :
చేపలను శుభ్రం చేసి, ఒక్కో చేపకు రెండువైపులా గాట్లు పెట్టాలి. ఆయిల్ మినహా పైన చెప్పుకున్న అన్ని పదార్థాలనూ (నిమ్మకాయ మినహా) ఒక పాత్రలోకి తీసుకుని సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇందులోనే నిమ్మరసం కూడా పిండాలి. ఈ మిశ్రమంలో గాట్లు పెట్టి ఉంచిన చేపలను వేసి, ఆ మిశ్రమం చేపలకు బాగా పట్టేలా కలిపి.. ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఒక పాన్‌లో సరిపడా నూనెను తీసుకుని, స్టవ్‌పై పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లోంచి చేపముక్కలను తీసి పాన్‌లో ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కొరమీను ఫ్రై రెడీ.