ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 15 జూన్ 2016 (12:35 IST)

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వేదిక ఏర్పాట్లు

1) జూలై నెలలో 8, 9 మరియు 10న డిట్రాయిట్‌లో జరుగనున్న ప్రథమ అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలను పురస్కరించుకుని అమెరికాలో జూలై 8వ తేది సాయంత్రం బ్యాంకెట్ విందు ఏర్పాటు చేస్తున్నారు. అమెరికన్ తెలంగాణ సంఘం అధ్యక్షులు రాంమోహన్ కొండగారు, కన్వీనర్ వినోద్ కుకునూర్‌గారు, కో-కన్వీనర్ నాగేందర్ ఐత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభలకు పలు రంగాలకు చెందిన అమెరికా, భారత్ మరియు పలు దేశాల నుండి ప్రముఖులు, కళాకారులు మరియు దాతలు పాల్గొంటారు. ఈ వేదిక/ ప్రాంగణం కమిటీకి వెంకటేశ్వర రెడ్డి బొల్లవరం చెయిర్‌గా, చైతన్య భల్ల కో-చెయిర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీతో ముఖాముఖీ మరియు వేదిక ఏర్పాట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
 
2) ఈ సంవత్సరం 2016 జూలై 8-10 తేదిలలో డిట్రాయిట్లో జరగనున్న అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలకు వేదిక, ప్రాంగణం  విభాగం యొక్క పని తీరుని వివరించండి? 
ప్రథమ అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలు డిట్రాయిట్‌లో సబర్బన్ హాలులో జరగడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. డిట్రాయిట్ సబర్బన్ హాలుకి చాల ప్రత్యేకత ఉంది. ఈ సబర్బన్ హాలులో ప్రతీ సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక బృహత్తర ప్రదర్శనలు, మహాసభలు  జరుగుతూ ఉంటాయి. ఈ  ప్రాంగణంలో ఈసారి అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలు ఏర్పాటు చేయాలని 2 నెలల క్రితం అమెరికన్ తెలంగాణ సంఘం కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అప్పటినుండి ఈ వేదిక ఏర్పాటుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది వారాలలో జరుగనున్న అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలకు వేదిక ఏర్పాటుకి మా కమిటీ సభ్యులు అహర్నిశలు పనిచేస్తున్నారు.
 
2) ఇంతపెద్ద మహాసభలకు ఆరువేలకు పైగా అతిధులు వేంచేస్తారు కదా? వీరందరికీ  అన్ని రకాల సదుపాయాలు ఉండడానికి  ఏ విధమైన ఏర్పాటులు చేస్తున్నారు?
దీనిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాము. సరళీకృత విధానంలో ఈ ప్రక్రియను అందుబాటులోకి తెస్తున్నాము. ఒత్తిడికి తావు లేకుండా , అందరిని సమన్వయపరుస్తూ, సూచనలు, సలహాలు, సమీక్ష సమావేశాలు ద్వారా విశ్లేషణలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వేదిక కమిటీ అన్నది చాల కీలకమైన విభాగం. కమిటీ అన్ని కమిటీలతో సమన్వయము పాటించవలసి ఉంటుంది. ఈ నేపధ్యంలో మా కమిటీ అన్ని కమిటీలతోను ముఖ్యంగా ప్రోగ్రాం & ఈవెంట్ కమిటీతో, ఆడియో వీడియో క కమిటీలతో వారి వారి అవసరాలకు ఏర్పాట్లు చేస్తోంది. మా కమిటీ సభ్యులు అందరు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని వారివారి విధులను అప్రమత్తతతో నిర్వర్తిస్తున్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులందరికీ ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలను సమకూరుస్తున్నాము. 
 
ఈ సబర్బన్ హాల్ ప్రాంగణం అతి విశాల మైనది. ఈ ప్రాంగణంలో జూలై 8 తేదిన బాంక్వెట్ కి 2౦౦౦ మందికి, అలాగే 9,10 తేదిలలో జరిగే కార్యక్రమాలకి హాజరు అయ్యే సుమారు 6,000 మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ సభలకు ౩౦౦ పైగా ప్రదర్శన కారులకు సదుపాయాలు, ఫుడ్ కోర్ట్ ఏర్పాట్లు, అలాగే అన్ని చోట్ల సంఘీకరణ కర్ణికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో సుమారు 40 గదులు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో సాహితి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ మొదలైన చర్చలు జరుగుతాయి. ఎప్పటికప్పుడు మా కమిటీ అమెరికన్ తెలంగాణ సంఘం నాయకత్వంతో సంప్రదించి వారి సూచనలు అమలు పరిచేందుకు ప్రయత్నిస్తున్నాము.
 
3)వేదిక కమిటీ గురించి , కమిటీ బాద్యతల గురించి, కమిటీ సభ్యుల గురించి వివరాలు చెప్తారా? 
ఈ కమిటీకి శ్రీ వెంకటేశ్వర రెడ్డి బొల్లవరం చెయిర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఈ కమిటీ కార్యనిర్వహణ జరుగుతుంది. అలాగే చైతన్య భల్ల వైస్ చెయిర్‌గా బాధ్యతలను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈయన ఆడియో వీడియో కమిటీలతో సమీక్షిస్తూ తగిన ఏర్పాట్లు చేస్తారు, అన్నివిభాగాలకి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
 
4) అతిథులను దృష్టిలో పెట్టుకుని, వారి భద్రతల గురించి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ప్రతిచోట ఎక్కడకక్కడ సైన్ బోర్డులు, పెద్దవారికి వీల్ చైర్స్, పసివాళ్ళకు స్ట్రాలర్ సదుపాయాలు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు, నీరు, లాస్ట్ అండ్ ఫౌండ్ బూత్లు, భోజనాల ముందు ఏర్పాట్లు, తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రథమ అమెరికన్ తెలంగాణ సంఘం మహాసభలు విజయవంతంగా జరగడానికి నడుం కట్టుకుని అన్నివిధాల సన్నాహాలు చేస్తున్నాము.