ప్రముఖ వైద్యులు డాక్టర్ కృపా సాగర్ రావు పాలకుర్తి కన్నుమూత

వెస్ట్‌వుడ్, ఎంఎ: ప్రముఖ వైద్యులు డాక్టర్ కృపా సాగర్ రావు పాలకుర్తి ఆదివారం నాడు నార్వుడ్ లోని నార్వుడ్ ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. పాలకుర్తి హైదరాదు నుంచి వెళ్లి ఇంగ్లాండులో స్థిరపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త ప్రశాంత్ పాలకుర

Krupa Sagar Rao Palakurthi
ivr| Last Modified మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:37 IST)
వెస్ట్‌వుడ్, ఎంఎ: ప్రముఖ వైద్యులు డాక్టర్ కృపా సాగర్ రావు పాలకుర్తి ఆదివారం నాడు నార్వుడ్ లోని నార్వుడ్ ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. పాలకుర్తి హైదరాదు నుంచి వెళ్లి ఇంగ్లాండులో స్థిరపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త ప్రశాంత్ పాలకుర్తి ఆయన కుమారుడే.
 
డాక్టర్ కృపా సాగర్ రావుకి భార్య వసంత పాలకుర్తి, పిల్లలు ప్రశాంత్, డాక్టర్ సంగీత, డాక్టర్ పునీతతో పాటు కోడలు అనూరాధ, అల్లుడు ప్రసాద్ కళ్యాణపు, ఐదుగురు మనవళ్లుమనవరాళ్లతోపాటు ఇద్దరు గొప్ప మునిమనవళ్లు కూడా ఉన్నారు. హైదరాబాదు నుంచి వెళ్లి ఇంగ్లండు వెస్ట్‌వుడ్‌లో స్థిరపడిన పాలకుర్తి ఏప్రిల్ 19, 1938లో జన్మించారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లాలోని మానుకోట. 
 
ఆయన చేసిన గొప్ప వైద్య సేవలు, కంటిచూపు సమస్యలతో బాధపడే ఎంతోమందికి ఆయన ఉచితంగా చేసిన వైద్య సేవలు చిరస్మరణీయం. వైద్య వృత్తిలో అంకితభావంతో ఆయన చేసిన సేవలను, సమాజంలో తనవంతు పాత్ర పోషిస్తూ తన వైద్య వృత్తితో ఎందరికో వైద్య సేవలను అందించిన ఆయన అవిరళ కృషిని కుటుంబ సభ్యులు స్మరించుకుంటున్నారు. అంతేకాదు, ఆయన ద్వారా వైద్య సేవలు పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు.
 
స్వర్గస్తులైన కృపా సాగర్ రావు నివాళి కార్యక్రమ వివరాలు:
ప్రాంతం: ఫోల్సమ్ శ్మశాన వాటిక, 649 హై స్ట్రీట్, వెస్ట్‌వుడ్, ఎంఎ
తేదీ: మంగళవారం డిసెంబరు 20, 2016
సమయం: సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య
 దీనిపై మరింత చదవండి :