ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (14:56 IST)

హరిశ్చంద్రుడిని గట్టెక్కించిన అజ ఏకాదశి వ్రతం.. కష్టాలు పరార్

Ekadasi
జన్మాష్టమి 4 రోజుల తర్వాత అజ ఏకాదశి వస్తుంది. అజ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు అంకితం. 29వ తేదీన గురువారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ పర్వదినాన శ్రీహరిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. 
 
ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితాలొస్తాయి. ఇదే రోజున సిద్ధి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం వంటి శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. వాస్తవానికి హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు, దుఃఖ సాగరంలో మునిపోయి, వీటి నుండి ఎలా బయటపడాలా ఆలోచిస్తున్నప్పుడు, గౌతమ ముని అక్కడికి చేరుకున్నాడు. 
 
అప్పుడు ఆ రాజు ఈ రుషిని తనకు కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరతాడు. ఆ సమయంలో శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి, ఉపవాసం ఉండటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అప్పటినుంచి గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
 
అజ ఏకాదశి తిథి ప్రారంభం : 29 ఆగస్టు 2024 గురువారం అర్ధరాత్రి 1:20 గంటలకు
అజ ఏకాదశి తిథి ముగింపు : 30 ఆగస్టు 2024, శుక్రవారం మధ్యాహ్నం 1:38 గంటలకు
వ్రత విరమణ సమయం : 30 ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 7:34 గంటల నుంచి ఉదయం 9:10 గంటల వరకు.
 
ఈ రోజున విష్ణువుకు అంకిత భావంతో పూజ చేసి 
"ఓం నమో భగవతే వాసుదేవయే" అనే మంత్రంతో ఆయనను స్తుతించండి. అజ ఏకాదశి కథను చదవండి. రోజంతా విష్ణు మహా మంత్రాన్ని పఠించండి. 
ద్వాదశి తిథి నాడు, ఏకాదశి ఉపవాసాన్ని అవసరమైతే పాలు పండ్లతో లేదా అన్నం, ఉప్పగా వుండే ఆహారంతో పారణ చేసుకోవచ్చు.