శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:54 IST)

మహిళలు తిరుమాంగళ్యాన్ని కోపంతో మెడ నుంచి తీసిపారేస్తే?

Mangalyam
స్త్రీలు ఈ తిరుమాంగళ్యాన్ని ఎప్పుడూ మెడలో ధరిస్తే కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. మాంగళ్యం కోసం ప్రతిరోజూ పసుపు, కుంకుమలతో వర్ధిల్లాలి అని దేవుడిని పూజించినట్లైతే.. మహిళలు సుమంగళీ ప్రాప్తంతో జీవిస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మెడలో ధరించి మంగళసూత్రంతో మాంగల్య బలం చేకూరుతుంది. 
 
ఇంత పవిత్రమైన తిరుమాంగళ్యం పట్ల మహిళలు తమ కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మహిళలు భూమాదేవిలా సహనంతో ఉండాలని వారు చెప్తున్నారు. ఒకవేళ కోపంతో మహిళలు మెడలోని మాంగల్యాన్ని విసిరికొట్టి తమ కోపాన్ని ప్రదర్శించించినట్లైతే ఏం జరుగుతుందో చూద్దాం..
 
పెళ్లయిన వరుడు బతికుండగానే మాంగల్యాన్ని విసిరేస్తే వారికే కాకుండా కుటుంబానికి కూడా తీరని నష్టం వాటిల్లుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇలా తెలిసి చేసినా, తెలియక చేసినా అశుభ ఫలితాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి. జాతకంలో ఎనిమిది, ఏడు, రెండు స్థానాలు సరిగా లేకుంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అందుచేత తిరుమాంగల్యం పట్ల మహిళలు శ్రద్ధగా వుండాలి. 
 
కొందరి జాతకంలో దోషం ఉంటుంది. ఈ దోష నివారణకు మాంగల్యాన్ని హుండీల్లో వేయడం మంచిది. ఇలా చేశాక కొత్త మంగళ సూత్రాన్ని భర్త చేతులారా కట్టించుకోవాలి. ఆ తర్వాత మెడలోని పాత మంగళసూత్రాన్ని హుండీలో వేయడం చేయాలి. ఇలా చేస్తే మాంగల్య దోషం నివృత్తి అవుతుంది. 
 
ఇలా చేస్తే కుటుంబంలో తగాదాలు, గొడవలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే మంగళసూత్రం విషయంలో కోపతాపాలకు స్థానం ఇవ్వకూడదని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.