వృధా అవుతున్న ఆహారాన్ని శునకానికి పెడితే..?
శివుని అంశగా పేర్కొనబడుతున్న భైరవునిలో 64 అవతారాలున్నాయట. అందులో కాలభైరవ అవతారానికి ప్రత్యేక స్థానం వుంది. ఆలయాలకు కాపలాగా కాలభైరవుడు వుంటాడని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
కాలభైరవుని అనుగ్రహం కోసం ఆయన వాహనమైన శునకానికి ఆహారం దానం చేయాలి. ఆహారాన్ని వృధా చేయకుండా శునకానికి ఇవ్వడం చేయాలి. శునకానికి వేరుగా ఓ ప్లేటును వుంచి అందులో ఆహారాన్ని వేస్తుండాలి. ఇలా చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.
అలాగే అష్టమి తిథుల్లో కాలభైరవుని ప్రార్థన విశేష ఫలితాలను ఇస్తుంది. శుక్ల, కృష్ణ పక్ష అష్టమి తిథులు కాలభైరవునికి ప్రీతికరం. ఈ రోజున కాలభైరవునికి జరిగే అభిషేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం కోరిన కోరికలను నెరవేర్చుతుంది.