మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-03-2021 శుక్రవారం దినఫలాలు - శ్రీమన్నారాయణ స్వామిని తులసీ దళాలతో...

మేషం : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. ధనం వృధాగా వ్యయం కావడం మినహా పెద్దగా ఫలితం ఉండదు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. తెలివిగా వ్యవహిరిస్తున్నామని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. 
 
వృషభం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబై్, రంగాల్లో వారికి ఒత్తిడి వంటివి తప్పవు. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ధనసహాయం అర్థించడానికి అభిజాత్యం అడ్డు వస్తుంది. 
 
మిథునం : స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. 
 
కర్కాటకం : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా ఉందుంతాయి. కపటంలేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించిపెడుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
సింహం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. గొప్ప గొప్ప ఆలోచనలు ఆశయాలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలుకాగలవు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 
కన్య : నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. స్త్రీల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. ధన సహాయం అర్థించడానికి అభిజాత్యం అడ్డు వస్తుంది. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. 
 
తుల : వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ వాక్ చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ముఖ్యం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం. 
 
ధనస్సు : స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. 
 
మకరం : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు ఉత్సాహాన్నిస్తాయి. కృషి, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
కుంభం : సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. 
 
మీనం : రాజకీయ ప్రజా సంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయండ వల్ల అశాంతికి గురవుతారు. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.