Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సోమవారం (06-08-2018) రాశిఫలాలు : చేసే పనుల్లో ఏకాగ్రత ముఖ్యం...

మేషం: వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. క్రమవిక్రయ రంగంలోన

Written By raman
Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (08:48 IST)
మేషం: వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. క్రమవిక్రయ రంగంలోని వారికి మెళకువ అవసరం. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
 
వృషభం: భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాలవారికి కలిసిరాగలదు. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. 
 
మిధునం: పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సలహా కంటె సొంత నిర్ణయమే అన్నివిధాల శ్రేయస్కరం. ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు.
 
కర్కాటకం: గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం ఉత్తమం. ఆధ్యాత్మిక విషయాలు, పుస్త పఠనంతో కాలక్షేపం చేస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
సింహం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్ధినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకుల నుండి పెద్ద మెుత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెళకువ వహించండి. 
 
కన్య: సమయస్పూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. బంధువురాక వలన కొంత అసౌకర్యానికి రోనవుతారు. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలలో పునరాలోచన అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. 
 
తుల: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. అధికారుల సుదీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. 
 
వృశ్చికం: వ్యవసాయ రంగాలవారికి ఎరువులు, క్రిమ సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక ఖర్చులెదురైనా కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
ధనస్సు: స్త్రీలు గృహోపరకణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదని గమనించండి. కందులు, ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకు వేస్తారు. 
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో మెుహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వకండి. బ్యాంకు పనులలో ఏకాగ్రత, మెళకువ ముఖ్యమని గమనించండి. కొన్ని అవకాశాలు ప్రయత్నపూర్వకంగాను, యాదృచ్ఛికంగాను కలిసివస్తాయి. నిరుద్యోగులుకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని ప్రేమించే వారికి అశ్రద్ధ చేయడం మానండి.
 
కుంభం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడుతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికి సహాయం చేసి మాటపడుతారు. 
 
మీనం: మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. బంధువుల మధ్య ప్రేమాను బంధాలు బలపడుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ, రంగాలలోని వారికి కలిసివస్తుంది. 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?

Vijay’s AP Visit: చంద్రబాబు- పవన్‌లతో భేటీ కానున్న తమిళనాడు సీఎం విజయ్

Rahul Gandhi, కార్యకర్తకి మోచేతితో రాహుల్ కుమ్మాయి పోటు, వీడియో వైరల్

జంతర్ మంతర్ ఇక నిరసనలకు కేటాయించిన ప్రదేశం కాదు.. డీ-నోటిఫై

వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు... కోమటిరెడ్డి

అన్నీ చూడండి

13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

తర్వాతి కథనం
Show comments