Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (29-08-19) దినఫలాలు - మిత్రులు అవసరాలు తీరాక...

మేషం: ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి చేసిన విమర్శలు తప్పవు. ఇరుగు పొరుగు వారి వైఖరి వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ నైపుణ్యతకు, సామర్ధ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంద

Written By raman
Updated: బుధవారం, 29 ఆగస్టు 2018 (09:30 IST)
మేషం: ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి చేసిన విమర్శలు తప్పవు. ఇరుగు పొరుగు వారి వైఖరి వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ నైపుణ్యతకు, సామర్ధ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృషభం: గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.  
 
మిధునం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. రాజకీయాల్లో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. పిల్లల భవిష్యత్తును గురించి పథకాలు వేసి జయం పొందుతారు. 
 
కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలలో ఆటంకాలు తొలగిపోతాయి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడుతాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
సింహం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ, తోటల రంగాలవారు శాస్త్రవేత్తల సలహాలు పాటించడం శ్రేయస్కరం. రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది.   
 
కన్య: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.  
 
తుల: వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
వృశ్చికం: పొదుపు చేద్దామనుకున్న మీ ఆలోచన ఫలించదు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. స్త్రీలు స్పల్ప అస్వస్థతకు గురవుతారు. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరికి సహాయం చేసి మాటపడవలసి వస్తుంది. మెుండిబాకీలు వసూలు చేస్తారు.
 
ధనస్సు: అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు నూతన వాతావరణం, పరిచయాలకు క్రమంగా అలవాటు పడుతారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో హడావుడిగా ఉంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం.
 
మకరం: కుటుంబంలో చిన్న చిన్న కలహాలేర్పడే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు రావచ్చు. ఉమ్మడి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కార మార్గం దొరుకుతుంది. 
 
కుంభం: స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. 
 
మీనం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ఎదుటివారని తక్కువ చేసి మాట్లాడడం వలన సమస్యలను ఎదుర్కుంటారు. నియమాలకు కట్టుబడి ఉండడం వలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments