కుడి భుజం అదిరితే ఏం జరుగుతుందో తెలుసా?

Astro
సిహెచ్| Last Modified శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (21:56 IST)
శరీరానికి కుడి భాగము అదిరితే శుభం కలుగుతుంది. ఎడమ భాగం అదిరితే అశుభము. నడి నెత్తిన అదిరితే భోజనప్రాప్తి. నొసలు అదిరితే శుభము. కుడి చెంప అదిరితే దండన, ఎడమ చెంప అదిరితే ఉద్యోగ లాభం కలుగుతుంది.

కుడికన్ను అదిరితే అశుభము, ఎడమ కన్ను అశుభము. రెండు కళ్లూ అదిరితే మేలు కలుగుతుంది. ముక్కు అదిరితే రోగము, పై పెదవి అదిరితే కలహం, క్రింది పెదవి అదిరితే భోజన సౌఖ్యము.

ఎడమ చెక్కిలి అదిరితే దొంగల భయం, కుడి చెక్కిలి అదిరితే ధన లాభం. కుడి భుజము అదిరితే సంభోగము ప్రాప్తి. ఎడమ భుజం అదిరితే హాని జరుగుతుంది. రొమ్ము భాగం అదిరితే ధనప్రాప్తి. చేతులు అదిరితే వాహనప్రాప్తి కలుగుతుంది. అరచెయ్యి అదిరితే సంతానప్రాప్తి.

కుడి తొడ అదిరితే ధన లాభం, ఎడమ తొడ అదిరితే భయం, మోకాళ్లు అదిరితే రోగ భయము, అరికాళ్లు అదిరితే సౌఖ్యము, ప్రక్క భాగము అదిరితే అలంకార ప్రాప్తి కలుగుతుంది.దీనిపై మరింత చదవండి :