25-09-2019- బుధవారం నాటి దినఫలాలు.

astro 12
రామన్| Last Updated: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (16:08 IST)
మేషం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఆహార వ్యవహారాల్లో మెళుకువ వహించండి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. వాహన చోదకులకు చోకాకులు అధికమవుతాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం.

మిధునం: మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.

కర్కాటకం: బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మంచి చేసినా విమర్శలు తప్పవు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది.

సింహం: చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైన సకాలంలో పూర్తి చేస్తారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలిసిరాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.

కన్య: రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు.

తుల: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. బ్యాంకు పనులు విసుగు కలిగిస్తాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యములో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి.

వృశ్చికం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలితకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. దైవదర్శనాలు, దూరప్రయాణాలు చేస్తారు. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ఆరోగ్యంలో మెళుకువ వహించండి. క్రయ విక్రయాల లాభదాయకం.

ధనస్సు: రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య దాపరికం అపార్థాలకు దారితీస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం వల్ల జయం చేకూరుతుంది.

మకరం: కుటుంబ అవసరాలు పెరగటంతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పెద్దల ఆహార వ్యవహారాలో మెళుకువ చాలా వహించండి.

కుంభం: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది.

మీనం: స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో గృహంలో ప్రశాంతత, సౌఖ్యం నెలకొంటాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.దీనిపై మరింత చదవండి :