శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:46 IST)

24-09-2019 మంగళవారం దినఫలాలు - రాబడికి మించిన ఖర్చులు...

మేషం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతుంది. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హోతోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. 
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు పురోభివృ్ద్ధి కానవస్తుంది. ప్లీడర్లకు చేజారి పోయిన కేసులు మరల తిరిగి వస్తాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరదు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగండి.  
 
మిధునం: రాజకీయాలలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయకండి. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. ఆదాయం సంతృప్తికరంగా ఉన్నా ధనం చేతిలో నిలబడటం కష్టమే. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషిపైనే ఆధారపడటం శ్రేయస్కరం. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
సింహం: ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృ్ద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటు చేసుకుంటాయి. 
 
కన్య: భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు వాయిదా పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
 
తుల: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించటం మంచిదికాదని గమనించండి. 
 
వృశ్చికం: రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచార లోపం వల్ల సదవకాశాలు చేజారిపోతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.
 
ధనస్సు: ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరీ, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత పురోభివృద్ధి ఉండదు. బంధువులను కలుసుకుంటారు.
 
మకరం: ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఒక ముఖ్యమైన విషయమై న్యాయ సలహా స్వీకరిస్తారు. ఋణ యత్నాలు వాయిదా పడతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కుంభం: స్త్రీలు అపోహల వల్ల మాటపడక తప్పదు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మీనం: దైవ, సేవా, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కీలకమైన వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. మొండి బాకీలు వసూలలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.