మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:24 IST)

22-09-2019 ఆదివారం దినఫలాలు - కానివేళలో ఇతరుల రాక..

మేషం: రోజులు, భారంగాను, విసుగ్గాను సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నూతనోత్సాహంతో పనులు చేపడతారు. పాతబాకీలు వసూలవుతాయి. బంధు, మిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం: సహోద్యోగులతో కలిసి సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు ఎదుర్కుంటారు.
 
మిధునం: ఆర్థిక కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.  ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని గమనించండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 
కర్కాటకం: కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోవడం ఉత్తమం. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
సింహం: ఒక వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయం కొంత ఆలస్యంగానైనా సత్ఫలితాలనిస్తుంది. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. రుణప్రయత్నం వాయిదా పడగలదు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి వారి ఆదరణ పొందుతారు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇబ్బందులు తప్పవు.
 
కన్య: ఎలక్ట్రిల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
తుల: మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు పనిభారం అధికం. మీ కుటుంబీకులు మీ మాటతీరును వ్యతిరేకిస్తారు. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు లాభదాయకం. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం: రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధనవ్యయం, చెల్లింపులకు సంబంధించిన విషయాలలో మెళుకువ వహించండి. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదర్శభావాలు కల వ్యక్తులు పరిచయం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడక తప్పదు.
 
మకరం: వృత్తి, వ్యాపారాలలో శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలు అందుకుంటారు. చిరుపరిచయాలు మరింతగా బలపడతాయి. కుటింబీకులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం: బంధువుల రాకతో కుటుంబములో సందడి నెలకొంటుంది. ముఖ్యుల మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోతాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చు కోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఎరువులు, విత్తన వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మీనం: ధనం మూలంగా కొన్ని పనులు సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. నిరుద్యోగులకు ఆశాజనకం. స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు.