మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (16:06 IST)

18-09-2019 బుధవారం దినఫలాలు - ప్రైవేటు విద్యా సంస్థలలో...

మేషం: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. చిన్నతరహా వృత్తులు, చిరువ్యాపారులకు కలిసి రాగలదు. ఎప్పటినుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు.
 
వృషభం: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
మిధునం: ఉమ్మడి వ్యవహారాలు, భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. ఇతరులకు అతి చనువు ఇవ్వటం మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
కర్కాటకం: విద్యాసంస్థల్లో వారికి ఉపాధ్యాయుల వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికమవుతాయి. మీ సోదరుడు, లేక సోదరి మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వాహనం కొనుగోలు, అమ్మకాలకై చేయు ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి.
 
సింహం: కోళ్ళ, పాడి, మత్స్య వ్యాపారస్తులకు అభివృద్ధి ఉండకపోవచ్చు. కమ్యూనికేషన్ రంగాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. 
 
కన్య: ఆర్థకాభివృ్ద్ధి కానవచ్చిని ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వంటివి ఎదుర్కుంటారు. రక్షణ రంగాల్లో గారికి రక్షణ కరువవుతుంది. పత్రికా, మీడియా రంగాల్లో వారికి గుర్తింపు లభించినా ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఇతర దేశాలు వెళ్ళలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టండి జయం చేకూరుతుంది.
 
తుల: వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్థిర, చరాస్తుల విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాడి పరిశ్రమ రంగాల్లో వారికి శ్రమ అధికం. మీ పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం: వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత పురోభివృద్ధి ఉండదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడకతప్పదు.
 
ధనస్సు: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మకరం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధికసమయం వేచి ఉండాల్సి వస్తుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
కుంభం: బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం: పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతిగా శ్రమిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.