శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (10:16 IST)

14-09-2019- శనివారం మీ రాశి ఫలితాలు ...

మేషం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం: బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో, ప్రయాణాలలో మెళుకువ అవసరం. నిరుద్యోగుల నిర్లిప్తి ధోరణి వల్ల సదవకాశాలు జార విడుచుకుంటారు. 
 
మిధునం: ప్రభుత్వ రంగ సంస్థలలోని వారికి మిత్రుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పాత పరిచయస్థుల ద్వారా ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు సుగమమవుతాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
కర్కాటకం: దైవ, పుణ్య కార్యాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. మిత్రులు చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటుతనం వల్ల పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి ఓదార్పుతో మానసికంగా కుదుటపడతారు.
 
సింహం: భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు.
 
కన్య: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. శ్రమాధిక్యత, ఎడతెగని ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ  ఆకట్టుకుంటారు. గృహ నిర్మాణాలు మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలెదురవుతాయి.
 
తుల: మీ అభిప్రాయాలకు, ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గలన్న పంతం అనర్ధాలకు దారితీస్తుంది.
 
వృశ్చికం: స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. మీ పనులు, వ్యవహారాలు మీరే స్వయంగా నిర్వహించుకోవటం మంచిది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు.
 
ధనస్సు: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలోనుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. 
 
మకరం: ప్రేమ వ్యవహారాల పట్ల మెళుకువ అవసరం. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మీ భావాలు, అభిప్రాయాలను ఎదుటివారు అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీరు ఎదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది.
 
కుంభం: మీ సంతానం మొండివైఖరి మీ ఎంతో చికాకు కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు.
 
మీనం: ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది. మొక్కుబడిగా చేసే యత్నాలు ఫలించవని గమనించండి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టతరమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు, ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం.