శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:50 IST)

21-09-2019 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు...

మేషం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సంకల్పసిద్ధితో ముందుకు సాగి పాత సమస్యలను పరిష్కరించండి. విదేశీ వాణిజ్యం, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలించగలవు. ప్రత్యర్థుల దృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
 
వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిదని గమనించండి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ముఖ్యుల నుండి వార్తలు అందుకుంటారు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది.
 
మిధునం: చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ముఖ్యమైన విషయాలకు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన పెట్టుబడులు ఆశించినంత సత్ఫలితాలను ఇవ్వవు. 
 
కర్కాటకం: సిమెంటు, ఐరన్ వ్యాపారస్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు బదిలీ అయ్యే ఆస్కారం ఉంది. ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.
 
సింహం: శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. మెరుగైన నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కన్య: అదనపు రాబడి కోసం యత్నాలు సాగిస్తారు. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ప్రముఖులును కలుసుకుంటారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
తుల: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులకు మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత అధికం. స్థిరచరాస్తుల చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. 
 
వృశ్చికం: రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. హోటలు, తినుబండ రంగాలలో వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.
 
ధనస్సు: ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు , స్టాకిస్టులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మకరం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఆశాజనకం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రమించిన కొలదీ ఫలితం, కార్యసాధనలో అనుకూలతలుంటాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి.
 
కుంభం: వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. టాక్స్ వంటి సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఆథ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీది కాని వస్తువును ఆశించటం వల్ల భంగపాటుకు గురవుతారు.
 
మీనం: విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఆపద సమయంలో బంధు మిత్రులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.