సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, మిధున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 17న సర్వ ఏకాదశి, 20న హోలి, 21న శ్రీ లక్ష్మీ జయంతి. నిత్యావసరాల ధరలు అధికమవుతాయి.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతం. మంగళ, బుధ వారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపకాలు, బాధ్యతలు విస్తరిస్తాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు సమయపాలన ప్రధానం.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీలో నైరాశ్యం చోటు చేసుకుంటంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులను కలుసుకుంటారు. పనులు హడివుడిగా సాగుతాయి. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. ధనం చేతిలో నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. జూదాల జోలికి పోవద్దు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావదహ దృక్పథంతో ముందుకు సాగండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. శని, ఆది వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, సమాచార సంస్థలను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ సమర్థత ఎదుటివారికి లాభిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. చేతివృత్తులు, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశాల్లోని సంతానం యోగక్షేమాలు తెలుసుకుంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. నిర్మాణాలు, మరమ్మత్తులు పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. బుధు, గురు వారాల్లో కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచననలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సభ్యత్వాలు, అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, సమావేశాలు, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
వృశ్చికం: విశాఖ 1వ పాదం, అనురాధ, జ్యేష్ట
పరిస్థితులు క్రమంగా చక్కబడుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. బుధ, గురు వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు ఇబ్బందులుండవు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలం వికటిస్తుంది.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సంబంధిత ఇబ్బందులెదురవుతాయి. సకాలంలో ధనం అందకపోవచ్చు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దంపతులు అవగాహనతో మెలగాలి. శుక్ర, శనివారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. వృత్తుల వారికి సామాన్యం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ఒత్తిడి, పనిభారం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2, పాదాలు
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాక సంతృప్తినిస్తుంది. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. సభ్యత్వాలు, అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యుర్థుల పథకాలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆశక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. రుణయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ప్రయోజనం ఉండదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దళారులు, విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉల్లాసాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఏజెంట్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సంతానం దూకుడును అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్యలు ఫలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.