1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:35 IST)

శుక్రవారం సంధ్యా సమయంలో ఎందుకు దీపం వెలిగించాలి?

శుక్రవారం సంధ్యా సమయంలో దీపం ఎందుకు వెలిగించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. శుక్రవారం సాయంత్రం ఎవరు దీపాలు వెలిగిస్తారో అట్టి వారందరి గృహాలకు తాను వస్తానని మహాలక్ష్మీదేవి ఓ భక్తురాలికి వరం ఇస్తుంది. అయితే ఓ భక్తురాలు తన పేదరికం పోవటానికి ఓ మహర్షిని ప్రార్థింపగా ఆయన ఓ ఉపదేశం చేస్తాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుని.. మహాలక్ష్మిని తన ఇంట స్థిరంగా ఉంచాలని ఆ భక్తురాలు భావిస్తుంది. ఇందులో భాగంగా ఆ రోజు రాజ్యంలో ఎవ్వరూ దీపం వెలిగించకుండా చేస్తుంది. '
 
అయితే ఆ భక్తురాలు మాత్రం సంధ్యా సమయంలో దీప కాంతులను వెలిగిస్తుంది. ఆ మహావెలుగును భరించలేక నల్లని వస్త్రాలను ధరించిన అలక్ష్మి బయటికెళుతుంటే, నీవు వెళితే తిరిగి రాకూడదని చెబుతుంది. సరేనని వెళ్తుంది. అదే సమయంలో ధగదగలాడే సీతాంబరధారి బయట చీకటిలో ఉండలేక లోనికొస్తుంటే గుమ్మంలో కూర్చున్న భక్తురాలు ఆపి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాకూడదని అంటుంది. సరేనని లక్ష్మీదేవి ఆమెకు అభయం ఇవ్వటంతోపాటు శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం వెలిగిస్తారో వారిని కూడా అనుగ్రహిస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. అందుకే లక్ష్మీదేవి నివాసముండాలంటే శుక్రవారం సంధ్యా సమయంలో దీపం వెలిగించాలని పురోహితులు అంటున్నారు.