శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:31 IST)

శుక్రవారం మహా సంకష్టహర చతుర్థి.. ఎర్రని పువ్వులతో వినాయకుడిని?

Vinayaka
ఆగస్టు 7వ తేదీ అంటే శుక్రవారం మహా సంకష్టహర చతుర్థి. ఈ రోజున వినాయకుడిని నిష్ఠతో పూజించినట్లైతే సకల సంకటాలు తొలగిపోతాయని విశ్వాసం. సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషం. 
 
సాధారణంగా గణపతిని పూజించి పూజల్లో చవితి పూజ విశేషమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వరదచతుర్థి అని, అమావాస్య తర్వాత వచ్చే చవితికి సంకష్టహర చతుర్థి అని పేరు. ఈ రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షని ఆచరించడం విశేషమని పండితులు చెప్తున్నారు. 
 
వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా వినాయకుడికి అవసరమైనవి. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయని విశ్వాసం. 
 
ఒకానొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళుతుండగా ఒక రాజ్యం దాటుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపోయిందట. దానికి కారణమేమిటి అని పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన ఒక వ్యక్తి ఒక్క చూపు కారణంగా పుష్పకం ఆగిందని వాలిన దని తెలుసుకున్నాడు. మహారాజుకు చెబుతున్న సందర్భం లో వారిద్దరి ముందునుంచి పుష్పక విమానంలో ఒక పుణ్య స్త్రీ ఆకాశం లోకి తీసుకువెడుతున్నారు.
 
అలా తీసుకువెళుతున్న దూతలను కారణం అడుగగా... ఆ దూతలు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఈమె తన జీవితంలో ఎన్నో పాపములు చేసింది కానీ నిన్నటి రోజు వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్ర దర్శనం చేసి మరణించింది కాబట్టి ఆమెకు ఉత్తమ గతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెళుతున్నాం అన్నారు.
 
ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఆ మహారాజు వినాయకుడి యొక్క మహిమ అని తెలుసుకుని అందరికీ ప్రచారం చేయించాడు. అప్పటినుండి సంకష్టహర చతుర్థి ఖ్యాతిని పొందడమే కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి కథను విన్న వాళ్ళకి చూసిన వారికి కూడా శ్రీ మహా గణపతి అనుగ్రహం పొంది సుశశాంతులతో జీవిస్తారని విశ్వాసం.