శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (23:50 IST)

9వ సంఖ్య జాతకులు ఎలా వుంటారు?

Number 9
ఏ నెలలో అయినాసరే 9, 18, 27 తేదీలలో పుట్టిన వారిని 9 అంకె జాతకులను అంటారు. ఈ తేదీలలో పుట్టినవారు కుజగ్రహ వ్యక్తులు అని అంటారు. వీరు కురుచ చేతులు, కాళ్లు కలిగి వుంటారు.

 
ఖాళీ స్థలాలను కొనుగోలు చేస్తూ ఆస్తిపరులుగా వుంటారు. డబ్బు ఖర్చు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తారు. శ్రమజీవులు, సకాలంలో కాకుండా వీలైనప్పుడల్లా భోజనం, ఫలహారాలు స్వీకరిస్తుంటారు.

 
అప్పులు ఇవ్వడం, పుచ్చుకోవడం రెండింటిలోనూ వీరు అందెవేసినచేయిగా వుంటారు.