1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (15:21 IST)

నలుపు దారాలు చేతికి కాళ్లకి కట్టుకుంటే?

Leg
నలుపు దారాలు చేతికి కాళ్లకి కట్టుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనాలుంటాయి. సాధారణంగా నలుపు రంగు శనీశ్వరునికి ప్రతీక.ఇటువంటి నలుపు దారాన్ని ధరించే ముందు ముందుగా ఆ శని దేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు. 
 
ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు. శనీశ్వరునికి సమర్పించిన ఈ నల్లటి దారాలను ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ నల్లటి దారాలను స్త్రీలు ఎడమ కాలికి, పురుషులు కుడికాలికి ధరిస్తుంటారు. 

మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, మంగళవారం నాడు మీ కుడి కాలు చుట్టూ నల్లటి దారం కట్టుకోండి. మీ ఆర్థిక సమస్యలన్నీ కాలక్రమేణా తొలగిపోతాయి. ఇంట్లో సంపద చేకూరుతుంది. జీవితంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
తొమ్మిది ముడులు వేసిన నల్లటి దారాలను శనివారం కట్టుకోవడం ద్వారా అదృష్టంగా భావిస్తారు. ఇంకా హనుమంతుడు డాలర్ గల నల్లని దారాన్ని మెడలో వేసుకున్నట్లైతే ఆ వ్యక్తిని అనారోగ్యాలు వేధించవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.