గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (19:11 IST)

ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు ఇలా చేస్తే?

ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు కిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా ఉత్తమమైన మార్గం ఏంటంటే.. అలాంటి పటాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. 
 
అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు. ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. 
 
ప్రవహిస్తున్న నదిలే వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్ఫూర్తిగా నమస్కరించి "గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర" అని వదిలేయండి. ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి.