శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 డిశెంబరు 2021 (11:05 IST)

రాబోయే శుక్రవారంతో శుభముహూర్తాలకు బంద్, మళ్లీ ఎప్పటి నుంచో తెలుసా?

పెళ్లిళ్లు, నూతన గృహ ప్రవేశాలు, దుకాణాల ప్రారంభం.. తదితర శుభకార్యాలకు ఈ శుక్రవారంతో ముహూర్తాలు ముగుస్తున్నాయి. జనవరి నెలలో పండుగ పట్టింపు... అంటే శూన్యమాసం అంటారు కనుక శుభముహార్తాలు లేవు. మళ్లీ ఫిబ్రవరి 3 నుంచి 20 వరకూ పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చని పండితులు చెపుతున్నారు.

 
అలాగే మార్చి 19 నుంచి 27 వరకూ ముహూర్తాలు వున్నట్లు జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. కనుక అప్పటివరకూ శుభకార్యాలకు నో ఛాన్స్. ఇకపోతే... శనిదేవుడికి ప్రీతికరమైన పుష్యమాసంలో నవగ్రహ ఆరాధనలు చేస్తే శనిభగవానుడు అనుగ్రహిస్తాడు.