గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (17:40 IST)

జనవరిలో 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవు

కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో బ్యాంకు ఉద్యోగులకు సెలవుల పండగ రానుంది. ఈ నెలలో ఏకంగా 16 రోజుల పాటు సెలవులు వచ్చాయి. వీటిలో శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. మొత్తం జనవరి నెలలో ఏకంగా 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు భారత రిజర్వు బ్యాంకు విడుదల చేసిన క్యాలండర్‌లో ఈ విషయం వెల్లడిస్తుంది. 
 
ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే, జనవరి 1వ తేదీన ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్ టక్, షిల్లాంగ్ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. జనవరి 3వ తేదీన ఐజ్వాల్, గ్యాంగ్‌‍టక్‌లలో బ్యాంకులు మూతపడుతాయి. 4న గ్యాంగ్‌టక్, 11న మిషనరీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో, 14వ తేదీన సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అహ్మదాబాద్, చెన్నైలలో సెలవులు ప్రకటించారు.
 
15వ తేదీన సంక్రాంతి, తిరువళ్ళూవర్ దినోత్సవం సందర్భంగా చెన్నై, బెంగుళూరు, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. 18వ తేదీన తైపూసం సందర్భంగా చెన్నైలో, 26న భారత గణతంత్ర వేడుకల సందర్భంగా అగర్తలా, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, శ్రీనగర్ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటికితోడుగా 8వ తేదీన రెండో శనివారం, 22న నాలుగో శనివారం, జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు.