శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:26 IST)

దేశ వ్యాప్తంగా రెండో రోజుకు చేరిన బ్యాంకుల సమ్మె

తమ డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా దేశ వ్యాప్తంగా 70 వేల మంది బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం, శుక్రవారాల్లో సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఫోరం కన్వీనర్ శ్రీరాం, అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నాగేశ్వర్ తెలిపారు. నష్టాల పేరుతో బ్యాంకులను మూసివేయాలని కేంద్రం చూస్తోందని వారు ఆరోపించారు. 
 
కాగా, హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఈ సమ్మెను ప్రారంభించరు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్రం కుట్రలు చేస్తుందని దానిని అడ్డుకునేందుకు వీలుగా సమ్మె చేస్తున్నారు.