శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శనివారం, 7 జులై 2018 (17:02 IST)

జూలై 08-07-2018 నుండి 14-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మిధునంలో రవి, కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, కేతువులు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 9న సర్వ ఏకాదశి, 11న మాస శివరాత

మిధునంలో రవి, కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, కేతువులు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 9న సర్వ ఏకాదశి, 11న మాస శివరాత్రి. 10న గురువు వక్ర త్యాగం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆందోళన తొలగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం, అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమర్ధతను చాటుకుంటారు. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సంతానానికి రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాహిత్య, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు భారమనిపించవు. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అభియోగాలు విమర్సలెదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహమార్పు ఫలితం కనిపిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆర్థికస్థితి గతం కంటే మెరుగనిపిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. అవసరాలు నెరవేరుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మంగళ, బుధ వారాల్లో నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉద్యోగస్తులు కుదుటపడుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. పరిచయం లేని వారితో జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణానికి అనుకూలం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శనివారం నాడు ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. సంప్రదింపులు ఫలించవు. యత్నాలను విరమించుకోవద్దు. పరిస్థితుల్లో నిదానంగా మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో జాగ్రత్త. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సహోద్యోగుల సాయంలో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు సామాస్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు సామాన్యం. కంప్యూటర్ రంగాలవారికి చికాకులు అధికం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. గృహంలో మార్పులు చేపడతారు. వ్యవహారానుకూలత ఉంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. తొందరపడి చెల్లింపులు జరుపువద్దు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో రాణిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. గృహంలో స్తబ్థత తొలగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సోదరులతో విభేదిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పువు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. గృహమార్పు అనివార్యం. వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆది, గురు వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు సాదన వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. పెద్దమెుత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పనులు అర్థాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. మంగళ, శని వారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. ఆత్మీయుల సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారుల దృష్టి మీపై పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. గృహం సందడిగా ఉంటుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవులు స్వీకరిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు అమర్చుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కంప్యూటర్ రంగాలవారికి చికాకులు అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. శనివారం నాడు అనేక పనులతో సతమతమవుతారు. సంతానం కోసం బాగా శ్రమిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి.  
 
మీనం: పూర్వబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. చిన్నపాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. జూదాల జోలికి పోవద్దు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వీడియోలో మీ వార రాశి ఫలితాలు వినండి...