రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి.