ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (12:08 IST)

సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. కష్టాల్లో భారత్

India vs England
India vs England
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుదిజట్టులో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు చోటు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
 
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. యువ ప్లేయర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (డకౌట్; 9 బంతుల్లో)‌ను మార్క్‌వుడ్ బోల్తా కొట్టించాడు. కాగా, ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీని సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.